Revanth: ఆదిరెడ్డి కష్టాలు ఎవరికీ రాకూడదు: బిగ్ బాస్ విన్నర్ రేవంత్

Revanth Interview
షార్ట్స్‌లో చూడండి
బిగ్ బాస్ సీజన్ 6లో టైటిల్ విన్నర్ గా రేవంత్ నిలిచాడు. టైటిల్ ట్రోఫీతో పాటు ఒక ఫ్లాటు .. కారు సొంతం చేసుకున్నాడు. తాజా ఇంటర్వ్యూలో రేవంత్ మాట్లాడుతూ .. " హౌస్ లో నేను సింపతీ కోసం .. సెంటిమెంట్ కోసం .. కంటెంట్ ఇవ్వడం కోసం ఎప్పుడూ ట్రై చేయలేదు. హౌస్ లోకి వెళ్లడానికి ముందు నాకు ఆదిరెడ్డి తెలియదు. ఆ తరువాత మా పరిచయం జరిగింది" అని చెప్పాడు. 

"బిగ్ బాస్ షోకి ఆదిరెడ్డి చాలా కష్టపడి వచ్చాడు. జీవితంలో ప్రతి ఒక్కరూ కష్టపడతారు. కానీ ఆదిరెడ్డివంటి కష్టాలు మాత్రం ఎవరికీ రాకూడదు. ఆదిరెడ్డి ఎప్పుడూ కూడా తన ఫ్యామిలీ గురించే మాట్లాడుతూ ఉండేవాడు. తనతోటి వారికి హెల్ప్ చేసే వ్యక్తి తను" అని అన్నాడు.

దాంతో ఆదిరెడ్డికి కాల్ చేసిన యాంకర్ .. రేవంత్ గురించి ఒక మాట చెప్పమని అడిగారు. అందుకు ఆదిరెడ్డి స్పందిస్తూ .. "రేవంత్ ను గట్టి పోటీదారుడిగా అందరూ భావించడం వల్లనే ఆయనలో తప్పులు వెతికేవాళ్లం. రేవంత్ కి ఉన్న కసి యూత్ లో ఉంటే లైఫులు మారిపోతాయి" అంటూ చెప్పుకొచ్చాడు.
Go Back to Shorts
Revanth
Srihan
Adireddy
Bigg Boss

More Telugu News