కైకాల సత్యనారాయణ మృతిపై కేసీఆర్ విచారం

KCR pays condolences to Kaikala Satyanarayana
  • 87 ఏళ్ల వయసులో తుది శ్వాస విడిచిన సత్యనారాయణ
  • మూడు తరాల ప్రేక్షకుల అభిమానాన్ని పొందారని ప్రశంస
  • ఆయన మరణం చలనచిత్ర రంగానికి తీరని లోటని వ్యాఖ్య
సీనియన్ సినీ నటుడు కైకాల సత్యనారాయణ అనారోగ్య కారణాలతో 87 ఏళ్ల వయసులో మృతి చెందిన సంగతి తెలిసిందే. ఆయన మృతి పట్ల తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ సంతాపాన్ని ప్రకటించారు. తెలుగు చలనచిత్ర రంగంలో తొలితరం నటుడిగా విభిన్న పాత్రలను పోషిస్తూ, తన వైవిధ్యమైన నటన ద్వారా మూడు తరాల ప్రేక్షకుల అభిమానాన్ని పొందారని కేసీఆర్ అన్నారు. సత్యనారాయణ మరణం తెలుగు చలనచిత్ర రంగానికి తీరని లోటు అని విచారం వ్యక్తం చేశారు. ఆయన కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు.
Advertisement
KCR
TRS
Kaikala Satyanarayana
Tollywood

More Telugu News