కాలికి గాయంతో వీల్ చెయిర్లోనే పార్లమెంటుకు వచ్చిన శశి థరూర్
- ఇటీవల పార్లమెంటులో జారిపడిన శశి థరూర్
- కాలికి గాయం.. కొన్నిరోజుల విశ్రాంతి
- కొనసాగుతున్న పార్లమెంటు సమావేశాలు
- పీఏల సాయంతో లోక్ సభకు వచ్చిన థరూర్
పార్లమెంటులోకి వీల్ చెయిర్ తో రావాలంటే ఒకే ఒక్క మార్గం ఉందని, అది డోర్ నెం.9 అని తెలిపారు. "మొత్తమ్మీద నా సిబ్బంది సాయంతో ఓ నాలుగు నిమిషాల పాటు లోక్ సభలో నా పర్యటన చక్కగా సాగింది. ఈ తాత్కాలిక వైకల్యం ద్వారా నాకో విషయం బోధపడింది... వైకల్యాలతో బాధపడేవారి కోసం మన వద్ద పేలవరీతిలో సదుపాయాలు ఉన్నాయన్న విషయం అర్థమైంది" అని వివరించారు. ఈ మేరకు తాను వీల్ చెయిర్లో ఉన్నప్పటి ఫొటోను కూడా శశి థరూర్ పంచుకున్నారు.