ఏ కేసు గురించి పిలిచారు అని అడిగినా ఈడీ అధికారులు సమాధానం చెప్పలేదు: బీఆర్ఎస్ ఎమ్మెల్యే రోహిత్ రెడ్డి
- నిన్న రోహిత్ రెడ్డిని 6 గంటల సేపు విచారించిన ఈడీ
- ఈరోజు మళ్లీ విచారణకు హాజరుకానున్న రోహిత్ రెడ్డి
- అన్ని డాక్యుమెంట్లతో రావాలన్న ఈడీ అధికారులు
తనను ఎందుకు విచారణకు పిలిచారు? ఏం సమాచారం అడుగుతున్నారని ప్రశ్నించినా ఈడీ అధికారులు మౌనంగా ఉన్నారని చెప్పారు. తన వ్యక్తిగత వివరాలు, వ్యాపార లావాదేవీలు, కుటుంబ సభ్యుల వివరాలను అడిగి తెలుసుకున్నారని వెల్లడించారు. విచారణ అధికారులు అడిగిన సమాచారాన్ని ఇచ్చానని... పలువురు అధికారులు అడిగిన అన్ని ప్రశ్నలకు సమాధానాలు ఇచ్చానని తెలిపారు. విచారణకు పూర్తిగా సహకరించానని చెప్పారు.
మరోవైపు విచారణ సందర్భంగా... నోటీసుల్లో పేర్కొన్న డాక్యుమెంట్లు దగ్గర ఉంచుకునేవి కాదని ఈడీ అధికారులకు రోహిత్ రెడ్డి తెలిపారు. ఆయా సంస్థల నుంచి వాటిని తీసుకోవాల్సి ఉందని... అందువల్ల తనకు కొంత సమయం ఇస్తే మీరు అడిగినవన్నీ ఇస్తానని చెప్పారు. రేపు అన్ని డాక్యుమెంట్లతో రావాలని ఈడీ అధికారులు ఆదేశించారు. దీంతో, ఈరోజు ఆయన మళ్లీ విచారణకు హాజరుకానున్నారు.