రేపు ప్రకాశం జిల్లాలో సీఎం జగన్ పర్యటన
ఏపీ సీఎం జగన్ రేపు (డిసెంబరు 20) ప్రకాశం జిల్లాలో పర్యటించనున్నారు. దర్శి ఎమ్మెల్యే మద్దిశెట్టి వేణుగోపాల్ తనయుడి వివాహ రిసెప్షన్ కు హాజరయ్యేందుకు ఆయన జిల్లాకు వస్తున్నారు. సీఎం జగన్ ఉదయం 10 గంటలకు తాడేపల్లి నివాసం నుంచి బయల్దేరతారు. ఉదయం 11 గంటలకు దర్శి చేరుకుంటారు.
ఎమ్మెల్యే మద్దిశెట్టి తనయుడి వివాహ రిసెప్షన్ లో పాల్గొని, వధూవరులను ఆశీర్వదించనున్నారు. అనంతరం మధ్యాహ్నం 12 గంటలకు దర్శి నుంచి బయల్దేరి ఒంటి గంటకు తాడేపల్లి చేరుకుంటారు. ఈ మేరకు సీఎం పర్యటన కోసం అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు.