ఆయన మంచోడు కాదు.. ఒక్కదానివే వెళ్లి ఎప్పటికీ కలవొద్దు: యువనటికి సింగర్ చిన్మయి సూచన
- వైరముత్తును కలిసిన ఫొటోను షేర్ చేసిన యువనటి అర్చన
- ఆయనతో జాగ్రత్తగా ఉండాలని హెచ్చరించిన చిన్మయి
- నీతో పాటు వేరే వ్యక్తులు లేకుండా ఆయన వద్దకు వెళ్లొద్దని సూచన
ఈ నేపథ్యంలో చిన్మయి స్పందిస్తూ, ఇలాగే మొదలవుతుందని, ఆయనతో జాగ్రత్తగా ఉండాలని అర్చనకు సూచించింది. వీలైనంత వరకు ఆయనకు దూరంగా ఉండాలని, నీ పక్కన వేరే వ్యక్తులు లేకుండా ఒక్కదానివే వెళ్లి ఆయనను ఎప్పటికీ కలవొద్దని చెప్పింది. విదేశాలలో ప్రోగ్రామ్ కోసం వెళ్లినప్పుడు వైరముత్తు తనను వేధింపులకు గురి చేశాడని మీటూ వేదికగా చిన్మయి గతంలో ఆరోపించిన సంగతి తెలిసిందే.