Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

ఆయన మంచోడు కాదు.. ఒక్కదానివే వెళ్లి ఎప్పటికీ కలవొద్దు: యువనటికి సింగర్ చిన్మయి సూచన

Singer Chinmayi warns actress Archana
Advertisement
  • వైరముత్తును కలిసిన ఫొటోను షేర్ చేసిన యువనటి అర్చన
  • ఆయనతో జాగ్రత్తగా ఉండాలని హెచ్చరించిన చిన్మయి
  • నీతో పాటు వేరే వ్యక్తులు లేకుండా ఆయన వద్దకు వెళ్లొద్దని సూచన
Advertisement
తమిళ సినీ నిర్మాత, రచయిత వైరముత్తుపై సింగర్ చిన్మయి మరోసారి తీవ్ర వ్యాఖ్యలు చేశారు. తొలుత ఆయన మంచి వ్యక్తిగానే కనిపిస్తారని, ఆ తర్వాత అసలు స్వరూపాన్ని ప్రదర్శిస్తారని, ఇబ్బందులకు గురి చేస్తారని అన్నారు. ఆయన గురించి తమిళ యువనటి అర్చనకు ఈ మేరకు సూచించారు. ఇటీవల వైరముత్తును అర్చన కలిసింది. ఆయనతో దిగిన ఫొటోను సోషల్ మీడియాలో షేర్ చేసింది. గొప్ప రచయిత వైరముత్తును కలిశానని, ఎంతో సంతోషంగా ఉందని ఆమె తెలిపింది. 

ఈ నేపథ్యంలో చిన్మయి స్పందిస్తూ, ఇలాగే మొదలవుతుందని, ఆయనతో జాగ్రత్తగా ఉండాలని అర్చనకు సూచించింది. వీలైనంత వరకు ఆయనకు దూరంగా ఉండాలని, నీ పక్కన వేరే వ్యక్తులు లేకుండా ఒక్కదానివే వెళ్లి ఆయనను ఎప్పటికీ కలవొద్దని చెప్పింది. విదేశాలలో ప్రోగ్రామ్ కోసం వెళ్లినప్పుడు వైరముత్తు తనను వేధింపులకు గురి చేశాడని మీటూ వేదికగా చిన్మయి గతంలో ఆరోపించిన సంగతి తెలిసిందే.
Advertisement
Advertisement
Chinmayi
Tollywood

More Telugu News