దక్షిణాఫ్రికాను వణికించిన బౌలర్లు.. రెండు రోజుల్లోనే టెస్టు గెలిచిన ఆస్ట్రేలియా
- తొలి టెస్టులో 6 వికెట్ల తేడాతో సఫారీ జట్టు పరాజయం
- తొలి రోజు 15 వికెట్లు, రెండో రోజు 9 వికెట్లు పడ్డ వైనం
- 34 పరుగుల లక్ష్యాన్ని కష్టంగా ఛేదించిన ఆస్ట్రేలియా
ఆసీస్ కు కేవలం 34 పరుగుల లక్ష్యం ఇచ్చింది. ప్యాట్ కమిన్స్ ఐదు వికెట్లతో చెలరేగగా, స్కాట్ బోలాండ్, మిచెల్ స్టార్క్ చెరో రెండు వికెట్లు పడగొట్టారు. వీరి దెబ్బకు సఫారీ జట్టులో ఎనిమిది మంది సింగిల్ డిజిట్ కే వెనుదిరిగారు. ఖయా జోండో (36), టెంబా బవూమ (29) రాణించారు. 34 పరుగుల లక్ష్యాన్ని ఆస్ట్రేలియా 7.5 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి ఛేదించింది. కగిసో రబాడ నాలుగు వికెట్లతో చెలరేగడంతో ఆసీస్ బ్యాటర్లు సైతం పెవిలియన్ కు క్యూ కట్టారు. ఖవాజా (2), వార్నర్ (3), స్మిత్ (6), హెడ్ (0) వరుసగా ఔటయ్యారు. అయితే, ఎక్స్ ట్రాల రూపంలోనే 19 పరుగులు రావడంతో ఆసీస్ గెలిచింది.