శునకాలకు శిక్షణనిస్తూ.. కుప్పకూలిన థాయిలాండ్ యువరాణి
- గుండె సంబంధిత సమస్యలే కారణమని వార్తలు
- ప్రాథమిక చికిత్స అనంతరం బ్యాంకాక్‌లోని మరో ఆసుపత్రికి తరలింపు
- ఆరోగ్యంపై భిన్న కథనాలు
మరోపక్క, ఆమె ఆరోగ్యంపై రాజకుటుంబం చేసిన ప్రకటనపై భిన్న కథనాలు వినిపిస్తున్నాయి. యువరాణికి చికిత్స అందుతోందని, ప్రస్తుతం ఆమె ఆరోగ్యం నిలకడగా ఉందని థాయ్ రాయల్ ప్యాలెస్ తెలిపింది. అయితే, సీపీఆర్ చేసినప్పటికీ ఆమె స్పందించలేదని, ఎక్మోద్వారా ఆమెకు చికిత్స అందిస్తున్నట్టు కూడా వార్తలు వినిపిస్తున్నాయి.
కాగా, థాయ్ రాజు మహా వజిరలాంగ్‌కార్న్ మొదటి భార్య సోమ్ సావాలి కుమార్తెనే బజ్రకిటియాబా. న్యాయశాస్త్రంలో పీజీ చేసిన ఆమె 2012-14లో ఆస్ట్రేలియాకు థాయిలాండ్ రాయబారిగా పనిచేశారు. దేశ న్యాయ సంస్కరణల్లో కీలక పాత్ర పోషించారు. కాగా, అధికారికంగా ప్రకటించనప్పటికీ థాయ్ రాజుకు ఆమెకు కాబోయే వారసురాలిగా చెబుతున్నారు.