విడుదలకు ముందే లీక్ అయిన అవతార్2.. మొత్తం చిత్రం ఆన్ లైన్లోకి!
- టెలీగ్రామ్, టోరెంట్స్ లో లింక్స్ ప్రత్యక్షం
- డౌన్ లోడ్ చేసుకొని ఉచితంగా చూస్తున్న ప్రేక్షకులు
- రేపు ప్రపంచ వ్యాప్తంగా విడుదల కానున్న చిత్రం
భారత్ లో హిందీ, తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో విడుదలవుతోంది. అయితే, ఈ చిత్రం మరొక రోజులో థియేటర్లలో సందడి చేయనుందనగా.. చిత్రబృందానికి పైరసీదారులు షాకిచ్చారు. గురువారమే ఈ చిత్రాన్ని లీక్ చేశారు. మొత్తం చిత్రాన్ని ఆన్ లైన్ లో పెట్టారు. లండన్ లో ఈ నెల 6వ తేదీనే విడుదల కావడంతో ఈ చిత్రం కాపీని టెలీగ్రామ్ తో పాటు టోరెంట్ సైట్లలో అందుబాటులో ఉంచారు. దాంతో, పలువురు దీన్ని డౌన్ లోడ్ చేసుకొని ఉచితంగా చూస్తున్నారు. చిత్రం లింక్స్ ను సోషల్ మీడియా ప్లాట్ ఫామ్స్ లో షేర్ చేస్తున్నారు.