సూర్యాపేటలో పోలీస్ పెట్రోలింగ్ వాహనం చోరీ
- కొత్త బస్టాండ్ వద్ద వాహనాన్ని ఆపి ఉంచిన పోలీసులు
- వాహనం కనిపించకపోవడంతో షాకైన పోలీసులు
- కోదాడ వద్ద అదుపులోకి తీసుకున్న పోలీసులు
ఆ సమయంలో వాహనానికే తాళం ఉండటంతో సులభంగా తీసుకెళ్లిపోయాడు. ఈ తెల్లవారుజామున 5 గంటలకు ఈ ఘటన జరిగింది. తమ వాహనం కనిపించకపోవడంతో పోలీసులు షాకయ్యారు. గాలింపు చర్యలను మొదలు పెట్టారు. సీసీ కెమెరాల ఫుటేజీ ఆధారంగా వాహనం వెళ్లిన దారిని గుర్తించారు. కోదాడ వద్ద దుండగుడిని అదుపులోకి తీసుకుని, వాహనాన్ని స్వాధీనం చేసుకున్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేశారు.
ఈ ఏడాది నవంబర్ 5న ఒడిశా రాయగఢ్ లో కూడా ఇలాంటి ఘటనే జరిగింది. పోలీస్ పెట్రోలింగ్ వాహనాన్ని ఒక దుండగుడు అపహరించాడు. ఆ తర్వాత పోలీసులు అతడిని గుర్తించి అరెస్ట్ చేశారు. వాహనాన్ని స్వాధీనం చేసుకున్నారు.