బీఆర్ఎస్ ఏపీ బాధ్యతలు కీలక నేతకు అప్పగింత.. అమరావతిలో భారీ బహిరంగసభకు కేసీఆర్ ప్లాన్!
- ఏపీ బాధ్యతలను తలసానికి అప్పగించిన కేసీఆర్
- హైదరాబాద్ లో ఉన్న ఏపీ ప్రముఖులతో సంప్రదింపులు జరుపుతున్న వైనం
- తెలుగు ప్రజలు ఎక్కువగా ఉండే రాష్ట్రాల్లో పోటీ చేయాలనే యోచన
ఈ క్రమంలో అమరావతిలో భారీ బహిరంగసభను నిర్వహించాలని కేసీఆర్ భావిస్తున్నట్టు తెలుస్తోంది. బహిరంగసభ బాధ్యతలను కూడా తలసానికి కేసీఆర్ అప్పగించారు. ఏపీ మూలాలు ఉండి హైదరాబాద్ లో ఉన్న ప్రముఖులతో కేసీఆర్ ఇప్పటికే సంప్రదింపులు జరిపారు. జాతీయ పార్టీ అధికారిక గుర్తింపు కోసం తెలుగు ప్రజలు ఎక్కువగా ఉండే రాష్ట్రాల్లో తొలుత పోటీ చేయాలనే యోచనలో కేసీఆర్ ఉన్నారు. తొలి దశలో ఏపీ, కర్ణాటక, తమిళనాడు, మహారాష్ట్రలో పోటీ చేయాలని భావిస్తున్నారు.