Geminid: నేటి రాత్రి ఆకాశంలో అద్భుత దృశ్యం

  • జెమినిడ్ ఉల్కాపాతం 
  • అర్ధరాత్రి 2 గంటలకు మరింత స్పష్టంగా
  • పట్టణాల వెలుపల, పల్లెల్లో చక్కగా వీక్షించొచ్చు
  • ఏ పరికరం అవసరం లేదు
Geminid meteor shower 2022 to peak at Decemer 14

నింగి ఎప్పుడూ మానవుడికి అంతుబట్టని విశేషాల కేంద్రమే. అలాంటి వినువీధిని నేటి సాయంత్రం తర్వాత ఓ సారి పరికించి చూడండి. ఓ విశేషం కళ్లకు కడుతుంది. అదే జెమినిడ్ ఉల్కాపాతం. ముఖ్యంగా అర్ధరాత్రి 2 గంటల సమయంలో ఉల్కాపాతం చాలా స్పష్టంగా, అద్భుతంగా కనిపిస్తుంది. ఎందుకంటే ఆ సమయానికి చంద్రుడి వెలుగు ప్రసరణ క్రమంగా తగ్గుతుంటుంది. కనుక ఉల్కాపాతం మరింత స్పష్టంగా కనిపిస్తుంది. 

గంటకు 150 ఉల్కలు భూ వాతావరణంలో వచ్చి మండిపోవడం, అవి వెలుగులుగా మనకు కనిపించడం జరుగుతుంది. ఇంకా మరింత స్పష్టంగా చూడాలంటే, నగర, పట్టణాలకు వెలుపల నివసించే వారు, పల్లె వాసులకు ఉల్కాపాతం మరింత స్పష్టంగా కనిపిస్తుంది. ఎందుకంటే వాతావరణంలో కాలుష్యం ఉండదు కనుక. పైగా పట్టణాల్లో లైట్ల కాంతి ఆకాశంలోని విశేషాల స్పష్టతకు అడ్డు పడుతుంది. 

జెమిని ఉల్కాపాతాన్ని ఏ పరికరం అవసరం లేకుండా కంటితో చూడగలరు. ప్లే స్టోర్ లో ఇంటరాక్టివ్ స్కై మ్యాప్ అప్లికేషన్ ను డౌన్ లోడ్ చేసుకుని, అందులో జెమిని కానస్టల్లేషన్ అని టైప్ చేస్తే విశేషాలు కళ్లముందుంటాయి. జెమినిడ్ ఉల్కాపాతాన్ని ఈ నెల 17 వరకు చూడొచ్చు. కాకపోతే మరింత కాంతివంతంగా, స్పష్టంగా చూడాలంటే నేడు, రేపు అనుకూలం. అర్ధరాత్రి సమయానికి నడి నెత్తిన, తెల్లవారు జామునకు ముందు పడమర వైపునకు ఈ ఉల్కాపాతం దిశ మారిపోతుంది.

More Telugu News