ఎమ్మెల్సీ అనంతబాబుకు సుప్రీంకోర్టులో ఊరట.. బెయిలు మంజూరు

  • డిఫాల్ట్ బెయిల్ ను మంజూరు చేసిన సుప్రీంకోర్టు
  • బెయిల్ షరతులను కింది కోర్టు విధించాలని ఆదేశం
  • మృతుడి తల్లి పిటిషన్ ను తిరస్కరించిన ధర్మాసనం
ఏపీ ఎమ్మెల్సీ అనంతబాబుకు సుప్రీంకోర్టులో ఊరట లభించింది. ఆయనకు షరతులతో కూడిన డిఫాల్ట్ బెయిల్ ను మంజూరు చేసింది. అయితే, షరతులను కింది కోర్టు విధించాలని ఆదేశించింది. డ్రైవర్ సుబ్రహ్మణ్యం హత్య కేసులో ఈ మేరకు తీర్పును వెలువరించింది. మరోవైపు అనంతబాబు పలుకుబడి కలిగిన వ్యక్తి అని, ఆయన బెయిల్ పై విడుదలైతే సాక్షులను ప్రభావితం చేసే అవకాశం ఉందని, అందువల్ల ఆయనకు బెయిల్ ఇవ్వకూడదంటూ మృతుడు సుబ్రహ్మణ్యం తల్లి వేసిన పిటిషన్ ను విచారించడానికి ధర్మాసనం నిరాకరించింది. తదుపరి విచారణను మార్చి నెలకు వాయిదా వేసింది.

YSRCP
Supreme Court
Bail
Anantha Babu

More Telugu News