బంగ్లాదేశ్ తో టెస్టు సిరీస్ కు జట్టులో మార్పులు చేసిన బీసీసీఐ
- ఈ నెల 14 నుంచి భారత్, బంగ్లాదేశ్ టెస్టు సిరీస్
- షమీ, జడేజా, రోహిత్ శర్మలకు గాయాలు
- అభిమన్యు ఈశ్వరన్, సౌరభ్ కుమార్, సైనీ ఎంపిక
- అదనంగా జయదేవ్ ఉనద్కట్ ఎంపిక
గాయపడిన ఆటగాళ్ల స్థానంలో బీసీసీఐ అభిమన్యు ఈశ్వరన్, సౌరభ్ కుమార్, నవదీప్ సైనీలను ఎంపిక చేసింది. అదనంగా లెఫ్టార్మ్ పేసర్ జయదేవ్ ఉనద్కట్ ను కూడా టెస్టు జట్టుకు ఎంపిక చేసింది. రోహిత్ శర్మ గైర్హాజరీతో తొలి టెస్టులో టీమిండియాకు కేఎల్ రాహుల్ నాయకత్వం వహిస్తాడు.