మా అమ్మాయిల విషయంలో చాలా టెన్షన్ పడ్డాం: జీవితా రాజశేఖర్
- సినిమాల్లో రాణిస్తున్న జీవిత కుమార్తెలు శివాత్మిక, శివాని
- సినిమాల్లో రాణించడం అంత సులభం కాదన్న జీవిత
- ఫేమ్ రావడం డెస్టినీ మీద ఆధారపడి ఉంటుందని వ్యాఖ్య
పిల్లలిద్దరూ చిన్నప్పటి నుంచి సినీ వాతావరణంలోనే పెరిగారని ఆమె తెలిపారు. సినిమాల్లోకి వస్తామని వాళ్లు చెప్పగానే తనకు, రాజశేఖర్ కు విపరీతమైన టెన్షన్ వచ్చిందని చెప్పారు. చిన్నప్పటి నుంచి వాళ్లకు ఏం కావాలన్నా ఆస్తులు అమ్మి అయినా సరే కొనిచ్చామని... అయితే సినిమాల్లో రాణించడం అంత సులభం కాదని, అందుకే టెన్షన్ పడ్డామని తెలిపారు.
సినిమాల్లో మంచి పాత్రలు లభించడం, ఫేమ్ రావడం అనేది డెస్టినీ మీద ఆధారపడి ఉంటుందని... డబ్బుతో వీటిని కొనలేమని... అందుకే తమ అమ్మాయిల విషయంలో చాలా టెన్షన్ పడ్డామని చెప్పారు. అయితే, వాళ్ల ఇష్టాలను గౌరవించి సపోర్ట్ చేస్తున్నామని తెలిపారు.