Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

మా అమ్మాయిల విషయంలో చాలా టెన్షన్ పడ్డాం: జీవితా రాజశేఖర్

Felt tension in our daughters matte says Jeevitha
Advertisement
  • సినిమాల్లో రాణిస్తున్న జీవిత కుమార్తెలు శివాత్మిక, శివాని
  • సినిమాల్లో రాణించడం అంత సులభం కాదన్న జీవిత
  • ఫేమ్ రావడం డెస్టినీ మీద ఆధారపడి ఉంటుందని వ్యాఖ్య
Advertisement
ప్రముఖ సినీ నటులు రాజశేఖర్, జీవితల కుమార్తెలు శివాత్మిక, శివాని ఇద్దరూ సినిమాల్లో రాణిస్తున్న సంగతి తెలిసిందే. తల్లిదండ్రుల నుంచి పుణికిపుచ్చుకున్న నట వారసత్వాన్ని వారు కొనసాగిస్తున్నారు. ఇప్పుడిప్పుడే ఇండస్ట్రీలో నిలదొక్కుకునేందుకు వారు యత్నిస్తున్నారు. మరోవైపు తమ పిల్లల గురించి మాట్లాడుతూ జీవిత కొంత భావోద్వేగానికి గురయ్యారు. 

పిల్లలిద్దరూ చిన్నప్పటి నుంచి సినీ వాతావరణంలోనే పెరిగారని ఆమె తెలిపారు. సినిమాల్లోకి వస్తామని వాళ్లు చెప్పగానే తనకు, రాజశేఖర్ కు విపరీతమైన టెన్షన్ వచ్చిందని చెప్పారు. చిన్నప్పటి నుంచి వాళ్లకు ఏం కావాలన్నా ఆస్తులు అమ్మి అయినా సరే కొనిచ్చామని... అయితే సినిమాల్లో రాణించడం అంత సులభం కాదని, అందుకే టెన్షన్ పడ్డామని తెలిపారు. 

సినిమాల్లో మంచి పాత్రలు లభించడం, ఫేమ్ రావడం అనేది డెస్టినీ మీద ఆధారపడి ఉంటుందని... డబ్బుతో వీటిని కొనలేమని... అందుకే తమ అమ్మాయిల విషయంలో చాలా టెన్షన్ పడ్డామని చెప్పారు. అయితే, వాళ్ల ఇష్టాలను గౌరవించి సపోర్ట్ చేస్తున్నామని తెలిపారు.
Advertisement
Advertisement
jeevitha
Tollywood

More Telugu News