పౌరసత్వాన్ని వదులుకుంటున్న భారతీయుల సంఖ్య పెరుగుతోంది!
- ఈ ఏడాది అక్టోబర్ వరకు పౌరసత్వాన్ని వదులుకున్న వారి సంఖ్య 1.83 లక్షలు
- గత ఏడాది 1.63 లక్షల మంది సిటిజెన్ షిప్ ను వదులుకున్న వైనం
- పార్లమెంటులో వివరించిన విదేశాంగ సహాయమంత్రి
ఈ ఏడాది అక్టోబర్ నాటికి 1.83 లక్షల మంది భారత పౌరసత్వాన్ని వదులుకున్నారని ఆయన తెలిపారు. గడచిన సంవత్సరాలతో పోలిస్తే ఇది చాలా ఎక్కువని చెప్పారు. 2021 లో 1.63 లక్షల మంది... 2020లో 85 వేల మంది... 2019లో 1.44 లక్షల మంది... 2018లో 1.34 లక్షల మంది... 2017లో 1.33 లక్షల మంది... 2016లో 1.41 లక్షల మంది... 2015లో 1.31 లక్షల మంది పౌరసత్వాన్ని వదులుకున్నారని చెప్పారు.