Team India: బంగ్లాతో మూడో వన్డేలో టాస్​ ఓడిన భారత్​... తుది జట్టులో ఉన్నది వీరే!

india loss toss in 3rd odi and to bat first
షార్ట్స్‌లో చూడండి
బంగ్లాదేశ్ తో తొలి రెండు వన్డేల్లో ఓడి ఇప్పటికే సిరీస్ కోల్పోయిన భారత్ మూడో వన్డేలో టాస్ కోల్పోయింది. గాయపడ్డ రోహిత్ శర్మ స్థానంతో కెప్టెన్ గా వ్యవహరిస్తున్న కేఎల్ రాహుల్ టాస్ నెగ్గలేకపోయాడు. బంగ్లా కెప్టెన్ లిటన్ దాస్ టాస్ గెలిచి మొదట బౌలింగ్ ఎంచుకున్నాడు. 

ఇక ఈ మ్యాచ్ లో భారత్ రెండు మార్పులతో బరిలోకి దిగింది. రోహిత్ శర్మ స్థానంలో యువ ఓపెనర్ ఇషాన్ కిషన్ ను తుది జట్టులోకి తీసుకుంది. పేసర్ దీపక్ చహర్ స్థానంలో సీనియర్ స్పిన్నర్ కుల్దీప్ యాదవ్ ను బరిలోకి దింపింది. మరోవైపు బంగ్లాదేశ్ సైతం తమ తుది జట్టులో రెండు మార్పులు చేసింది. నసుమ్ స్థానంలో స్టార్ పేసర్ తస్కిన్ అహ్మద్ ను తీసుకుంది. నజ్ముల్ శాంటో బదులు యాసిర్ అలీని ఆడిస్తోంది. 

తుది జట్లు:
భారత్: 1 శిఖర్ ధావన్, 2 ఇషాన్ కిషన్, 3 విరాట్ కోహ్లీ, 4 శ్రేయాస్ అయ్యర్, 5 కేఎల్ రాహుల్ (కెప్టెన్ & కీపర్), 6 వాషింగ్టన్ సుందర్, 7 అక్షర్ పటేల్, 8 శార్దూల్ ఠాకూర్, 9 కుల్దీప్ యాదవ్, 10 మహ్మద్ సిరాజ్, 11 ఉమ్రాన్ మాలిక్.

బంగ్లాదేశ్: 1 లిటన్ దాస్ (కెప్టెన్), 2 అనాముల్ హక్, 3 యాసిర్ అలీ, 4 షకీబ్ అల్ హసన్, 5 ముష్ఫికర్ రహీమ్ (కీపర్), 6 మహ్మదుల్లా, 7 అఫీఫ్ హుస్సేన్, 8 మెహిదీ హసన్ మిరాజ్, 9 తస్కిన్ అహ్మద్, 10 ముస్తాఫిజుర్, 11 ఎబాదత్ హుస్సేన్.
Go Back to Shorts
Team India
Bangladesh
3rd odi
kl rahul
Rohit Sharma

More Telugu News