ఎంత మంచి బాసో.. 10 వేల ఉద్యోగుల కుటుంబాలకు డిస్నీల్యాండ్ ట్రిప్
- డిస్నీల్యాండ్ చేరుకునేందుకు ఉచితంగా ఫ్లయిట్ టికెట్లు
- పర్యటన సమయంలో అన్ని సదుపాయాలూ ఉచితమే
- సిటాడెల్ ఫౌండర్, సీఈవో గ్రిఫిన్ నిర్ణయాలు
ఉద్యోగులు కంపెనీకి అందిస్తున్న సేవలను ఆయన ఈ విధంగా గుర్తించి, గౌరవించినట్టయింది. పర్యటన సందర్భంగా భోజనాలు, టిఫిన్లు, ఇతరత్రా రూపాయి కూడా ఖర్చు కాకుండా మొత్తం సిటాడెల్ కంపెనీయే భరించింది. ‘‘చరిత్రలోనే కాకుండా, ఫైనాన్స్ చరిత్రలోనూ ఎంతో అసాధారణ టీమ్ ను మనం ఏర్పాటు చేసుకున్నాం. మన ముందు ఎంతో అద్భుత భవిష్యత్తు ఉంది. కొత్త అధ్యాయాలను లిఖించేందుకు చూస్తున్నాను’’ అంటూ ఉద్యోగులకు గ్రిఫిన్ సందేశం ఇచ్చారు. గ్రిఫిన్ 31.7 బిలియన్ డాలర్ల సంపదతో ప్రపంచంలో 40వ అత్యంత సంపన్నుడిగా ఉన్నట్టు ఫోర్బ్స్ జాబితా తెలియజేస్తోంది.