గుజరాత్, హిమాచల్ ఎన్నికల ఫలితాలపై మోదీ స్పందన ఇది
- గుజరాత్ ప్రజలు బీజేపీతో ఉన్నారని మరోసారి నిరూపితమైందన్న మోదీ
- తమపై నమ్మకం, విశ్వాసంతోనే మళ్లీ అధికారం కట్టబెట్టారని వ్యాఖ్య
- ఓడిపోయినా హిమాచల్ అభివృద్ధికి సహకరిస్తామని ప్రధాని స్పష్టీకరణ
భూపేంద్రపై మోదీ ప్రశంసలు కురిపించారు. ఘట్లోడియా సెగ్మెంట్ నుంచి 2.13లక్షల భారీ మెజార్టీతో గెలిచిన భూపేంద్రది అసాధారణ విజయం అని కొనియాడారు. ఎన్నికల ఫలితంతో బీజేపీ కార్యకర్తల కష్టానికి ఫలితం దొరికిందని మోదీ అన్నారు. ఉత్తర ప్రదేశ్, బీహార్ ఉప ఎన్నికల్లోనూ బీజేపీ సత్తా చాటిందన్నారు.
మరోవైపు బీజేపీ అధికారం కోల్పోయిన హిమాచల్ ప్రదేశ్ ఫలితంపై మోదీ స్పందించారు. హిమాచల్ లో గెలుపోటముల మధ్య ఒక్క శాతం మాత్రమే తేడా ఉందన్నారు. ఓడిపోయినా హిమాచల్ ప్రదేశ్ అభివృద్ధికి వంద శాతం సహకరిస్తామని మోదీ స్పష్టం చేశారు. బీజేపీ దేశం కోసం కఠినమైన, పెద్ద నిర్ణయాలు తీసుకుంటుందని మోదీ తెలిపారు.