మీ అసమర్థ పాలనలో ఇంకెంతమంది మహిళలు బలికావాలి?: టీడీపీ నాయకురాలు అనిత
- ప్రేమోన్మాది ఘాతుకానికి తపస్వి బలి
- సీఎం ఉదాసీనత వల్లే ఉన్మాదులు రెచ్చిపోతున్నారన్న అనిత
- చంద్రబాబు వస్తేనే మహిళలకు భద్రత అని వ్యాఖ్య
"వైసీపీ మూడున్నరేళ్ల పాలనలో మహిళలపై అఘాయిత్యాలు నితృకృత్యమయ్యాయి. మొన్న రమ్య, నిన్న తపస్విని... రేపు ఎవరో? జగన్ రెడ్డీ... మీ అసమర్ద పాలనలో ఇంకెంతమంది మహిళలు బలికావాలి? జగన్ రెడ్డి పోలీసు వ్యవస్ధను దుర్వినియోగం చేయటం వల్లే రాష్ట్రంలో ఈ పరిస్థితికి కారణం. వైసీపీ పాలనలో పోలీసులు శాంతి భద్రతలు కాపాడటంలో ఫెయిలైనా... ప్రతిపక్షనేతల్ని కట్టడి చేయటం, అక్రమ కేసులతో వేధించటంలో మాత్రం సక్సెస్ అయ్యారు. చంద్రబాబు నాయుడు మళ్ళీ ముఖ్యమంత్రి అయితేనే రాష్ట్రంలో మహిళలకు భద్రత, రక్షణ" అని అనిత స్పష్టం చేశారు.