నీటిపై వేగంగా నడిచిన పెద్ద తొండ.. వీడియో ఇదిగో
- వీడియోను షేర్ చేసిన ఐఎఫ్ఎస్ అధికారి నందా
- నీటి అణువులు ఒక్కటైనప్పుడు జంతువులు సునాయాసంగా నడవొచ్చని పోస్ట్
- వైరల్ గా మారిన వీడియో
‘‘నీటి అణువులు ఒకదానితో ఒకటి కలిసినప్పుడు సృష్టించబడే శక్తి ప్రబలంగా ఉంటుంది. అప్పుడు చిన్న జంతువులు నీటి ఉపరితలంపై సునాయాసంగా నడుచుకుంటూ వెళ్లొచ్చు’’ అని సుశాంత నందా ఈ వీడియోతోపాటు పోస్ట్ చేశారు. ఈ వీడియో పట్ల నెటిజన్లు హర్షాన్ని వ్యక్తం చేస్తున్నారు. ప్రకృతి తన అందాలను ప్రపంచానికి ఎప్పుడూ చూపిస్తూనే ఉంటుందని ఓ ట్విట్టర్ యూజర్ కామెంట్ చేశారు.