అమెజాన్ లో తొలగింపులు పదివేలు కాదు 20 వేలట!
- ఉద్యోగాల కోతలపై తాజాగా బయటపడ్డ వాస్తవాలు
- తొలగింపులు కొనసాగుతున్నాయని కంపెనీ వర్గాల వెల్లడి
- రాబోయే రోజుల్లోనూ మరికొందరిని ఇంటికి పంపే యోచనలో అమేజాన్
కంపెనీ ఉద్యోగులు మాత్రం మరోలా చెప్పారు. వాలంటరీగా రాజీనామా చేసి వెళ్లిపోవాలంటూ కంపెనీ అడుగుతోందని పలువురు సోషల్ మీడియాలో ఆరోపించారు. కాగా, తాత్కాలిక, శాశ్వత ప్రాతిపదికతో పాటు గంటలలెక్కన పనిచేసే సిబ్బందిని కూడా కలుపుకుంటే అమెజాన్ లో సుమారు 15 లక్షల మంది ఉద్యోగులు ఉన్నారని సమాచారం.
ప్రపంచవ్యాప్తంగా వివిధ దేశాల్లో ఉన్న తమ ప్లాంట్లు, వేర్ హౌస్ లు, కంపెనీ ఔట్ లెట్లలో పనిచేస్తున్న సుమారు 10 వేల మంది ఉద్యోగులను అమెజాన్ ఇంటికి పంపించేసిందని వార్తలు వెలువడ్డాయి. అమెజాన్ కంపెనీలో తొలగింపులు పది వేల మందితో ఆగిపోవని, రాబోయే రోజుల్లో మరింత మంది ఉద్యోగులకు పింక్ స్లిప్ ఇచ్చి ఇంటికి పంపిస్తుందని తాజాగా బయటపడ్డ రిపోర్టుల్లో వెల్లడైంది. కంపెనీలో పనిచేస్తున్న మేనేజర్లతో సహా చిన్నా పెద్ద ఉద్యోగులు మొత్తం 20 వేల మందిని తొలగించాలన్నదే అమెజాన్ ఆలోచన అని తేలింది.