టాటా ఏస్ వాహనం బోల్తా.. బాపట్లలో నలుగురు అయ్యప్ప భక్తుల మృతి
- అదుపు తప్పి బోల్తా పడిన వాహనం
- మరో 15 మందికి తీవ్ర గాయాలు
- తెనాలి ఆసుపత్రికి క్షతగాత్రుల తరలింపు
ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన వారిని తెనాలి ఆసుపత్రికి తరలించారు. మృతులను కృష్ణా జిల్లా నిలపూడి గ్రామానికి చెందిన బొలిశెట్టి పాండురంగారావు (40), పాశం రమేశ్ (55), బోదిన రమేశ్ (42), బుద్దన పవన్ కుమార్ (25) గా పోలీసులు గుర్తించారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.