రాజమౌళికి ప్రతిష్ఠాత్మక అవార్డు
- 'ఆర్ఆర్ఆర్' సినిమాకు మరో ఘనత
- ఉత్తమ దర్శకుడిగా రాజమౌళికి ది న్యూయార్క్ ఫిల్మ్ క్రిటిక్స్ సర్కిల్ అవార్డు
- ఇప్పటికే పలు అంతర్జాతీయ అవార్డులను సొంతం చేసుకున్న 'ఆర్ఆర్ఆర్'
1935 నుంచి ఈ అవార్డులను ఇస్తున్నారు. వార్తాపత్రికలు, మేగజీన్స్, ఆన్ లైన్ పబ్లికేషన్లకు చెందిన పలువురు ప్రముఖులు ఒక బృందంగా ఏర్పడి ఈ అవార్డులను అందజేస్తున్నారు. సినీ పరిశ్రమలో ఉత్తమ ప్రతిభను కనబరిచిన వారికి ఈ అవార్డులను ఇస్తున్నారు.
ఇప్పటికే 'ఆర్ఆర్ఆర్' సినిమా ప్రపంచ వ్యాప్తంగా శాటర్న్, సన్ సెట్ సర్కిల్ వంటి పలు అంతర్జాతీయ అవార్డులను దక్కించుకుంది. 'ఆస్కార్' బరిలో కూడా నిలిచింది. దాదాపు 14 విభాగాల్లో ఈ సినిమా ఆస్కార్ వేదికగా పోటీ పడనుంది.