ఐసీఎస్ఈ 10, ఐఎస్సీ 12 తరగతి పరీక్షల షెడ్యూల్ వచ్చేసింది.. పరీక్షల తేదీలివే!
- ఎగ్జామ్స్ డేట్ షీట్‌ను ప్రకటించిన సీఐఎస్సీఈ
- వచ్చే ఏడాది ఫిబ్రవరి 27 నుంచి పదో తరగతి పరీక్షలు
- ఫిబ్రవరి 13 నుంచి 12వ తరగతి పరీక్షలు
వచ్చే ఏడాది ఫిబ్రవరి 27 నుంచి మార్చి 29 వరకు ఐసీఎస్ఈ పదో తరగతి పరీక్షలు జరగనుండగా, ఫిబ్రవరి 13 నుంచి మార్చి 31 వరకు ఐఎస్సీ 12వ తరగతి పరీక్షలు ప్రారంభమవుతాయి. మే 2023లో ఫలితాలను వెల్లడిస్తారు. వెబ్సైట్లో పూర్తి షెడ్యూల్ అందుబాటులో ఉందని సీఐఎస్సీఈ పేర్కొంది.
పరీక్ష హాలుకు విద్యార్థులు నిర్దేశిత సమయానికి ఐదు నిమిషాల ముందే రావాలని సూచించింది. ఆలస్యంగా వచ్చేవారు అందుకు సరైన కారణం చెప్పాల్సి ఉంటుందని పేర్కొంది. అరగంటకు పైగా ఆలస్యమైతే పేపర్ ఇవ్వబోమని స్పష్టం చేసింది. అలాగే, ఎగ్జామ్ పూర్తికాకుండా హాలు నుంచి విద్యార్థులను బయటకు పంపరు.