బెంగళూరు డ్రగ్స్ కేసులో ఐదుగురు టీఆర్ఎస్ ఎమ్మెల్యేల పాత్ర: బండి సంజయ్
- ప్రజా సంగ్రామ యాత్రలో భాగంగా నిర్మల్ లో మాట్లాడిన బీజేపీ నేత
- బెంగళూరులో టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు డ్రగ్స్ దందా చేస్తున్నారన్న సంజయ్
- డబ్బులిచ్చి కేసు కొట్టివేయించుకున్నారని ఆరోపణ
- ఆ కేసును రీ ఓపెన్ చేయిస్తున్నామని వెల్లడి
బెంగళూరులో టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు డ్రగ్స్ దందా చేస్తున్నారని బండి సంజయ్ అన్నారు. ఈ క్రమంలో బెంగళూరు డ్రగ్స్ కేసులో టీఆర్ఎస్ కు చెందిన ఐదుగురు ఎమ్మెల్యేల పాత్ర ఉందని బెంగళూరు పోలీసులు నిర్ధారించారన్నారు. ఈ విషయం తెలుసుకున్న టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు బెంగళూరు పోలీసులకు డబ్బులిచ్చి మరీ కేసును కొట్టివేయించుకున్నారన్నారు. కర్ణాటకలో తమ పార్టీ ప్రభుత్వం ఉన్నా కూడా టీఆర్ఎస్ నేతలు ఈ కేసులో తమ పేర్లను కొట్టివేయించుకున్నారని ఆయన చెప్పారు.