విరాళాల రూపంలో బీజేపీపై వందల కోట్ల వర్షం
- గత ఏడాదిలో రూ. 614.53 కోట్ల విరాళాలు వచ్చినట్టు వెల్లడి
- కాంగ్రెస్ ఖాతాలో రూ 95.46 కోట్ల జమ
- తృణమూల్ కాంగ్రెస్ కు వచ్చింది రూ. 43 లక్షలే
బీజేపీ, కాంగ్రెస్ సహా జాతీయ పార్టీలు తమకు వచ్చిన విరాళాల గురించిన సమాచారాన్ని ఎన్నికల సంఘానికి సమర్పించాయి. ఈ వివరాల ప్రకారం దేశంలో 2021-22కు గాను బీజేపీకే అత్యధికంగా విరాళాలు వచ్చాయి. ఇదే కాలానికిగాను మమతా బెనర్జీ నేతృత్వంలోని తృణమూల్ కాంగ్రెస్ పార్టీకి రూ.43 లక్షలు మాత్రమే వచ్చాయి. కేరళలో అధికారంలోఉన్న సీపీఎం రూ.10 కోట్లు విరాళంగా పొందింది. గతేడాది పశ్చిమ బెంగాల్ తో పాటు కేరళ అసెంబ్లీకి గతేడాది ఎన్నికలు జరిగాయి. నిబంధనల ప్రకారం రూ.20 వేల కంటే ఎక్కువ మొత్తం విరాళాలుగా వస్తే వాటి వివరాలను ఎన్నికల సంఘానికి సమర్పించాలి.