Adivi Sesh: నీ జీవితమే ఒక పోరాటం .. 'హిట్ 2' నుంచి సాంగ్ రిలీజ్!

Hit 2 movie lyrical song release
షార్ట్స్‌లో చూడండి
అడివి శేష్ హీరోగా శైలేశ్ కొలను దర్శకత్వంలో 'హిట్ 2' సినిమా రూపొందింది. నాని సొంత బ్యానర్లో నిర్మితమైన ఈ సినిమా డిసెంబర్ 2వ తేదీన థియేటర్లకు రానుంది. ఈ నేపథ్యంలో ఈ సినిమా నుంచి 'పోరాటమే .. పోరాటమే .. నీ జీవితం ఒక పోరాటమే' అనే ఒక లిరికల్ సాంగ్ ను రిలీజ్ చేశారు. 

"రక్తమే అంటుకున్న చేతులా .. ఎంతకీ వదిలిపోని మరకలా .. నిదురలో పోనే పోనీ చేదు గురుతులా " అంటూ ఈ పాట మొదలవుతోంది. హీరో కార్యదీక్ష .. ఆయన ధైర్యసాహసాలకి సంబంధించిన నేపథ్యంలో ఈ పాట ప్లే అవుతోంది. పోలీస్ ఆఫీసర్ గా హీరో డ్యూటీకి సంబంధించిన విజువల్స్ పై వచ్చే పాట ఇది.  

సురేశ్ బొబ్బిలి స్వరపరిచిన ఈ పాటకి కృష్ణకాంత్ సాహిత్యాన్ని అందించాడు. దర్శకుడు శైలేశ్ కొలను .. నిర్మాత ప్రశాంతి కలిసి ఈ పాటను ఆలపించడం విశేషం. అడివి శేష్ జోడీగా మీనాక్షి చౌదరి అలరించనుండగా, ఇతర ముఖ్యమైన పాత్రలలో రావు రమేశ్ .. పోసాని .. కోమలి ప్రసాద్ కనిపించనున్నారు.
Go Back to Shorts
Adivi Sesh
Meenakshi
Rao Ramesh
Posani
Hit 2 Movie

More Telugu News