టీఆర్ఎస్ లో చేరాలన్న నిర్ణయానికే కట్టుబడి ఉన్నాం: కేకే, వివేక్, మందా
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

టీఆర్ఎస్ లో చేరాలన్న నిర్ణయానికే కట్టుబడి ఉన్నాం: కేకే, వివేక్, మందా

టీఆర్ఎస్ లో చేరాలన్న నిర్ణయానికి కట్టుబడి ఉన్నామని ఎంపీ వివేక్ స్పష్టం చేసారు. తాము స్వార్ధపరులమని చేస్తున్న ప్రచారం వెనుక సీఎం పాత్ర ఉందని ఆరోపించారు. సోమాజీగూడలోని ప్రెస్ క్లబ్ లో టీఆర్ఎస్ లో చేరిన ఎంపీలు కేకే, వివేక్, మందా మాట్లాడుతూ, తమ సహచర ఎంపీలు ఉద్యమాలు చేసినా సంకల్పబలం లేక వెనక్కు తగ్గారని అన్నారు. పదవులు ఆశిస్తోంది తామా? లేక విమర్శలు చేస్తున్న నేతలా? అన్నది ప్రజలు గుర్తించాలని అన్నారు. తమను విమర్శించేముందు ఆ నేతలు అద్దం ముందు నిలుచుని చూసుకోవాలన్నారు. తెలంగాణ కోరుకున్న వారికే ఓటు వేయాలని కోరారు. బీజేపీ నేతలకు తెలంగాణ పట్ల చిత్తశుద్ది ఉందని, వారిని తప్పుపట్టడం లేదని చెప్పారు. తామెవర్నీ విమర్శించాలని అనుకోవడం లేదని, తమ లక్ష్యం కేవలం తెలంగాణ సాధనే అని అన్నారు.

More Telugu News