ఊహించని పరిణామం.. సువేందును కలిసిన మమతా బెనర్జీ
- నందిగ్రామ్ లో సువేందు చేతిలో ఓడిపోయిన మమత
- అప్పటి నుంచి ఇద్దరూ కలుసుకోని వైనం
- సువేందుని తేనీటికి ఆహ్వానించిన మమత
ఈ సందర్భంగా ఆయనతో పాటు మరో ఇద్దరు బీజేపీ ఎమ్మెల్యేలు ఉన్నారు. అనంతరం అసెంబ్లీ సెషన్ లో సువేందుని తన సోదరుడు అని సంబోధిస్తూ మమత మాట్లాడారు. సువేందుని తాను టీ కి ఆహ్వానించానని చెప్పారు. మరోవైపు, దీనిపై సువేందు మాట్లాడుతూ, ఇది మర్యాదపూర్వకంగా జరిగిన కలయిక అని అన్నారు. అయితే, తాను టీ తాగలేదని చెప్పారు.