ట్విట్టర్ లో మిగిలింది.. ఇక 2750 మంది ఉద్యోగులు మాత్రమే!
- ఎలాన్ మస్క్ రాక ముందు 7,500 మంది ఉద్యోగులు
- ఇక మీదట తొలగింపులు ఉండవన్న సంకేతం
- కొత్తగా ఇంజనీర్లను తీసుకుంటున్నట్టు ప్రకటన
ఇక మీదట తాను ఉద్యోగులను తొలగించబోనంటూ ఎలాన్ మస్క్ తాజాగా ప్రకటించారు. ఉద్యోగుల తొలగింపు పూర్తయిందంటూ.. కొత్తగా ఇంజనీర్లు, సేల్స్ విభాగంలో ఉద్యోగులను నియమించుకుంటున్నామని, రిఫరల్స్ ఉంటే చెప్పాలని మస్క్ ట్విట్టర్ ఉద్యోగులను కోరినట్టు సమాచారం. సాఫ్ట్ వేర్ ప్రొగ్రామ్ లో కోడ్స్ ను గొప్పగా రాసే వారికి ఎక్కువ ప్రాధాన్యం ఉంటుందని ఆయన స్పష్టం చేశారు. ట్విట్టర్ ప్రధాన కార్యాలయాన్ని శాన్ ఫ్రాన్సిస్కో నుంచి టెక్సాస్ కు తరలించే ఆలోచనేదీ లేదన్నారు. అక్టోబర్ 27న ఎలాన్ మస్క్ ట్విట్టర్ ను స్వాధీనం చేసుకోవడం తెలిసిందే.