Allu Arjun: 'పుష్ప 2' కోసం తెరపైకి కేథరిన్ పేరు!

  • బన్నీ, సుకుమార్ ల 'పుష్ప 2'  
  • పోలీస్ ఆఫీసర్ పాత్రలో కేథరిన్ 
  • బన్నీతో ఇది ఆమెకి మూడో సినిమా 
  • వచ్చే ఏడాదిలో ప్రేక్షకుల ముందుకు  
Pushpa 2 movie update

అల్లు అర్జున్ - సుకుమార్ కాంబినేషన్లో 'పుష్ప 2' సినిమాకి సంబంధించిన అప్ డేట్స్ కోసం అభిమానులు ఎంతో ఇంట్రెస్టింగ్ గా ఎదురుచూస్తున్నారు. పాన్ ఇండియా స్థాయిలో రూపొందే ప్రాజెక్టు కావడంతో, అందుకు తగినట్టుగా మరిన్ని పాత్రలు ఈ కథలో వచ్చి చేరనున్నాయి. ఇప్పటికే ఈ సినిమా కోసం విజయ్ సేతుపతి .. అర్జున్ కపూర్ వంటి వారి పేర్లు వినిపించాయి. 

ఇక తాజాగా కేథరిన్ పేరు తెరపైకి వచ్చింది. ఈ సినిమాలో నెగెటివ్ షేడ్స్ కలిగిన లేడీ పోలీస్ ఆఫీసర్ పాత్రలో ఆమె కనిపించనుందని అంటున్నారు. 'పుష్ప' అంతు చూస్తానంటూ ఆ ఫారెస్టులోకి ఆమె ఎంట్రీ ఇస్తుందని అంటున్నారు. ఆమె బాడీ లాంగ్వేజ్ ను కూడా డిఫరెంట్ గా డిజైన్ చేశారని చెబుతున్నారు. 

బన్నీతో కేథరిన్ ఇంతకుముందు 'ఇద్దరమ్మాయిలతో' .. 'సరైనోడు' వంటి సినిమాలు చేసింది. ఇక ఇప్పుడు 'పుష్ప 2' కోసం కూడా ఆమెను రంగంలోకి దింపనున్నట్టుగా తెలుస్తోంది. రష్మిక కథానాయికగా అలరించనున్న ఈ సినిమాకి, దేవిశ్రీ ప్రసాద్ సంగీతాన్ని సమకూర్చుతున్నాడు. వచ్చే ఏడాది ద్వితీయార్థంలో ఈ సినిమా విడుదల ఉంటుందని సమాచారం.

More Telugu News