వాట్సాప్ తెరుచుకోవాలంటే లాక్ ఓపెన్ చేయాల్సిందే
- డెస్క్ టాప్ అప్లికేషన్ పై తీసుకొస్తున్న వాట్సాప్
- ప్రస్తుతం పరీక్షల దశలో ఈ ఫీచర్
- దీనివల్ల వాట్సాప్ సంభాషణలకు రక్షణ
ఈ ఫీచర్ పై వాట్సాప్ ప్రస్తుతం పనిచేస్తోంది. దీనివల్ల ఒకరి కంప్యూటర్ మరొకరు తెరిచినప్పుడు వాట్సాప్ ను చూడలేరు. ఇప్పటి వరకు డెస్క్ టాప్ పై వాట్సాప్ లో ఒక్కసారి లాగిన్ అయితే చాలు. ప్రతిసారి పాస్ వర్డ్ ఇవ్వక్కర్లేదు. దానంతట అదే తెరుచుకుంటుంది. దీనిపై యూజర్లు ఎప్పటి నుంచో గగ్గోలు పెడుతున్నారు. దీంతో వాట్సాప్ ఇన్నాళ్లకు లాక్ ఫీచర్ తీసుకొస్తోంది.