కృష్ణ పార్థివదేహం వద్ద భోరున విలపించిన మోహన్ బాబు

Mohan Babu emotional after seeing Krishnas mortal
  • కృష్ణ భౌతికకాయాన్ని చూసి చలించిపోయిన మోహన్ బాబు
  • శవపేటికను పట్టుకుని వెక్కివెక్కి ఏడ్చిన వైనం
  • తట్టుకోలేకపోతున్నానని కంటతడి
ప్రముఖ సినీనటుడు, సూపర్ స్టార్ కృష్ణ పార్థివ దేహానికి పలువురు సినీ, రాజకీయ ప్రముఖులు నివాళి అర్పించారు. కేసీఆర్, చంద్రబాబు, చిరంజీవి, పవన్ కల్యాణ్, జూనియర్ ఎన్టీఆర్, అల్లు అర్జున్, వెంకటేశ్, రామ్ చరణ్ తదితరులు నివాళి అర్పించారు. మరోవైపు కృష్ణ భౌతికకాయాన్ని చూసిన వెంటనే మోహన్ బాబు చలించిపోయారు. భోరున విలపించారు. శవపేటికను పట్టుకుని వెక్కివెక్కి ఏడ్చారు. 

అనంతరం ఆయన మాట్లాడుతూ, తాను కష్ట సమయంలో ఉన్నప్పుడు కృష్ణనే తనను పైకి తీసుకొచ్చారని తెలిపారు. కృష్ణతో కలిసి 70కి పైగా సినిమాల్లో నటించానని, కొన్ని చిత్రాలకు అసిస్టెంట్ డైరెక్టర్ గా కూడా చేశానని చెప్పారు. కృష్ణగారి మరణాన్ని తట్టుకోలేకపోతున్నానని ఆవేదన వ్యక్తం చేశారు.
Go Back to Shorts
Mohan Babu
Krishna
Tollywood

More Telugu News