సానియాతో విడాకుల పుకార్లకు చెక్ పెట్టిన షోయబ్ మాలిక్!

Amid divorce rumors Shoaib Malik drops birthday message for Sania Mirza
  • సానియా పుట్టిన రోజు సందర్భంగా శుభాకాంక్షలు
    చెబుతూ ట్వీట్
  • ఈ ఇద్దరూ విడిపోతున్నారని కొన్నాళ్లుగా వార్తలు
  • పాకిస్థాన్ లో టాక్ షో చేయబోతున్న దంపతులు 
భారత టెన్నిస్ స్టార్ సానియా మీర్జా, పాకిస్థాన్ క్రికెటర్ షోయబ్ మాలిక్ దంపతులు విడాకులు తీసుకోబోతున్నారంటూ కొంతకాలంగా పుకార్లు వినిపిస్తున్నాయి. పాకిస్థాన్ కు చెందిన ఓ నటితో షోయబ్ మాలిక్ డేటింగ్ చేస్తున్నాడని, దాంతో, అతనికి సానియా దూరంగా ఉంటోందని వార్తలు వస్తున్నాయి. అయితే, ఈ వార్తలపై సానియా, మాలిక్ దంపతులు స్పందించలేదు. వాటిని ఖండించనూ లేదు. దాంతో, విడాకుల వార్తలు నిజమేనని అభిమానులు భావిస్తున్నారు. 

ఇలాంటి సమయంలో షోయబ్ మాలిక్.. సానియా మీర్జాకు పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలిపాడు. సానియా మంగళవారం 36వ పడిలోకి అడుగు పెట్టింది. ఈ సందర్భంగా సానియాతో దిగిన ఫొటోను ట్విట్టర్ లో షేర్ చేసిన మాలిక్.. ఆమెకు శుభాకాంక్షలు తెలపడంతో వీరిద్దరి విడాకుల పుకార్లకు చెక్ పెట్టే ప్రయత్నం చేశాడు. దీనికి బలం చేకూర్చేలా సానియా, షోయబ్ ఇద్దరూ కలిసి ఓ టాక్ షోను హోస్ట్ చేస్తున్నారు. పాకిస్థాన్ కు చెందిన ఓటీటీ ప్లాట్ ఫామ్ ఉర్దు ఫ్లిక్స్ లో ‘ద మీర్జా మాలిక్ షో’లో కనిపించనున్నారు.
Go Back to Shorts
Sania Mirza
shoib malik
divorce
rumors
birthday
message

More Telugu News