బీహార్‌లో వింత శిశువు జననం.. గ్రహాంతరవాసిగా ప్రచారం!
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

బీహార్‌లో వింత శిశువు జననం.. గ్రహాంతరవాసిగా ప్రచారం!

Infant born with rare deformity in Bihars
  • బీహార్‌లో ముక్కులేకుండా జన్మించిన శిశువు
  • ముక్కుకు రంధ్రం లేకపోవడంతో నోటి ద్వారా ఆక్సిజన్ అందిస్తున్న వైద్యులు
  • వినాయకుడిగా, గ్రహాంతరవాసిగా ప్రచారం
బీహార్‌లో జన్మించిన ఓ వింత శిశువును గ్రహాంతరవాసిగా ప్రచారం చేస్తున్నారు. శిశువు ముక్కు స్థానంలో రెండు కళ్లు ఉండడమే ఈ ప్రచారానికి కారణం. అయితే, కొందరు మాత్రం వినాయకుడు పుట్టాడని చెబుతున్నారు. రాష్ట్రంలోని అలీషేర్‌పూర్‌కు చెందిన సరోజ పటేల్ భార్య రూపాదేవి ఇటీవల ఓ బిడ్డకు జన్మనిచ్చింది. 

అయితే, జన్యుపరమైన లోపాల కారణంగా శిశువు ముక్కు ఉండాల్సిన స్థానంలో కళ్లు ఉండి చూడడానికి గ్రహాంతరవాసిలా ఉండడంతో అదే ప్రచారం జరుగుతోంది. శ్వాస తీసుకునేందుకు రంధ్రం లేకపోవడంతో వైద్యులు నోటి ద్వారా ఆక్సిజన్ అందిస్తున్నారు. ఇందుకోసం ప్రత్యేకంగా పైపులు ఏర్పాటు చేశారు. వింత శిశువు జననం గురించి తెలిసిన జనం పలు రకాలుగా ప్రచారం చేస్తున్నారు. అయితే, క్రోమోజోమ్‌ల లోపాలతో శిశువులు ఇలా జన్మిస్తారని గైనకాలజిస్టులు చెబుతున్నారు.
Bihar
Motihari
Alien

More Telugu News