Janasena: విజయనగరం బయలుదేరిన పవన్ కల్యాణ్... దారి వెంట ఘన స్వాగతం పలికిన జనసేన శ్రేణులు

pawan kalyan starts for vijayanagaram from vizag
షార్ట్స్‌లో చూడండి
జనసేన అధినేత పవన్ కల్యాణ్ నేటి ఉదయం విశాఖ నుంచి విజయనగరం బయలుదేరారు. జగనన్న ఇళ్లు.. పేదలందరికీ కన్నీళ్లు పేరిట రాష్ట్రంలో జగనన్న ఇళ్లపై జనసేన తనిఖీలు చేస్తున్న సంగతి తెలిసిందే. ఆయా ప్రాంతాల్లో జగనన్న కాలనీల్లో సదుపాయాలను తనిఖీ చేయనున్న పార్టీ శ్రేణులు... ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరిని ప్రశ్నించేందుకు సన్నాహాలు చేస్తున్నాయి. ఇందులో భాగంగా విజయనగరం జిల్లా గుంకలాంలో ఏర్పాటు చేస్తున్న జగనన్న కాలనీని పరిశీలించేందుకు పవన్ వెళుతున్న సంగతి తెలిసిందే.

గడచిన 2 రోజులుగా విశాఖలోనే ఉన్న పవన్ కల్యాణ్... నేటి ఉదయం పార్టీ కీలక నేతలతో కలిసి రోడ్డు మార్గం ద్వారా గుంకలాం బయలుదేరారు. ఈ సందర్భంగా దారి పొడవునా పవన్ కు జనసేన శ్రేణులు ఘన స్వాగతం పలుకుతున్నాయి. ఎక్కడికక్కడ పార్టీ శ్రేణులు పవన్ కు భారీ స్వాగత సత్కారాలను ఏర్పాటు చేశాయి. దారి వెంట తనకు అందుతున్న స్వాగత సత్కారాలను స్వీకరిస్తూ పవన్ ముందుకు సాగుతున్నారు. నేటి మధ్యాహ్నంలోగా పవన్ గుంకలాం చేరుకుంటారు.
Go Back to Shorts
Janasena
Pawan Kalyan
Vijayanagaram District
Jagananna Colonies
Gunkalam
Vizag

More Telugu News