నరేంద్ర మోదీ స్టేడియం పేరును మారుస్తాం: గుజరాత్ కాంగ్రెస్ మేనిఫెస్టోలో కీలక హామీలు
- గుజరాత్ ఎన్నికల మేనిఫెస్టోను విడుదల చేసిన కాంగ్రెస్
- 10 లక్షల ఉద్యోగాలను కల్పిస్తామని హామీ
- రూ. 3 లక్షల వరకు రైతు రుణమాఫీ
రాష్ట్రంలో 10 లక్షల ఉద్యోగాల కల్పన, ప్రభుత్వ ఉద్యోగాల్లో మహిళలకు 50 శాతం రిజర్వేషన్లు, ఒంటరి మహిళ, వితంతువు, వృద్ధ మహిళలకు నెలకు రూ. 2 వేల పెన్షన్, 3 వేల ప్రభుత్వ పాఠశాలల ఏర్పాటు, పోస్ట్ గ్రాడ్యుయేషన్ వరకు అమ్మాయిలకు ఉచిత విద్యుత్, రూ. 3 లక్షల వరకు రైతు రుణాల మాఫీ, 300 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్, నిరుద్యోగ యువతకు నెలకు రూ. 3 వేల భృతి, రూ. 500కే గ్యాస్ సిలిండర్ తదితర హామీలు కాంగ్రెస్ మేనిఫెస్టోలో ఉన్నాయి. డిసెంబర్ 1న, 5న గుజరాత్ లో రెండు విడతల్లో అసెంబ్లీ ఎన్నికలు జరుగుతున్నాయి. డిసెంబర్ 8న కౌంటింగ్ జరుగుతుంది.