కశ్మీరీ ఫైల్స్ డైరెక్టర్ కొత్త సినిమా.. వివరాలివిగో!
- కరోనా టీకా నేపథ్యంలో వివేక్ అగ్నిహోత్రి కొత్త ప్రాజెక్టు
- త్వరలోనే సెట్స్ పైకి ‘ది వ్యాక్సిన్ వార్’
- వచ్చే ఏడాది ఆగస్టులో పదకొండు భాషల్లో విడుదల
- సోషల్ మీడియాలో వివరాలు పంచుకున్న అగ్నిహోత్రి
‘ది వ్యాక్సిన్ వార్’ పేరుతో నిర్మిస్తున్న సినిమా పోస్టర్ ను వివేక్ అగ్నిహోత్రి సోషల్ మీడియాలో విడుదల చేశారు. వచ్చే ఏడాది ఆగస్టులో స్వాతంత్ర్య దినోత్సవ కానుకగా ఈ సినిమాను విడుదల చేయనున్నట్లు ప్రకటించారు. దీనిని హిందీతో పాటు తెలుగు, మరాఠీ, తమిళ, కన్నడ సహా మొత్తం పదకొండు భాషల్లో నిర్మిస్తున్నట్లు తెలిపారు. కశ్మీరీ ఫైల్స్ తర్వాత అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్ బ్యానర్ పై కాంబినేషన్ తో ఈ సినిమాను తీసుకొస్తున్నట్లు ఆయన వివరించారు. ఈ సినిమా నటీనటులు, ఇతర వివరాలను త్వరలోనే ప్రకటించనున్నట్లు తెలిపారు.