లైకా ప్రొడక్షన్స్ వారి నెక్ట్ మూవీ ఇదే .. ఫస్టులుక్ రిలీజ్!
- అథర్వమురళి హీరోగా 'పట్టాతు అరసన్'
- కథానాయికగా ఆషిక రంగనాథ్
- సంగీత దర్శకత్వం వహిస్తున్న గిబ్రాన్
- కీలకమైన పాత్రను పోషిస్తున్న రాధిక
అలాంటి లైకా వారు తమ బ్యానర్లో నెక్స్ట్ రిలీజ్ కానున్న సినిమా ఏమిటనేది ఈ రోజున చెబుతామంటూ నిన్ననే ఒక ఎనౌన్స్ మెంట్ ఇచ్చారు. అందుకు సంబంధించిన అప్ డేట్ కొంతసేపటి క్రితమే ఇచ్చారు. లైకా ప్రొడక్షన్స్ లో నిర్మితమవుతున్న ఆ సినిమా పేరే 'పట్టాతు అరసన్'. తాజాగా ఈ సినిమా నుంచి ఫస్టులుక్ పోస్టర్ ను రిలీజ్ చేశారు.
పోస్టర్ చూస్తుంటే ఇది గ్రామీణ నేపథ్యంలో నడిచే కథ అనే విషయం అర్థమవుతోంది. అక్కడి పెద్దరికం .. దానిని ఎదిరించేవారిని ఎదుర్కోవడం కథలో ప్రధానమైన అంశం కావొచ్చునని అనిపిస్తోంది. ఈ సినిమాలో మాస్ లుక్ తో అథర్వ మురళి నటిస్తుండగా, అతని సరసన నాయికగా ఆషిక రంగనాథ్ కనిపించనుంది. కీలకమైన పాత్రను రాధిక పోషిస్తోంది. సర్కుణం దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాకి, గిబ్రాన్ సంగీతాన్ని సమకూర్చుతున్నాడు
.