తెలంగాణ గవర్నర్ ను కలిసిన సినీ నటుడు అలీ
- తన కూతురు వివాహానికి గవర్నర్ ను ఆహ్వానించిన అలీ
- గవర్నర్ తమతో ఎంతో అభిమానంగా మాట్లాడారని వెల్లడి
- గవర్నర్ తో తమిళంలో మాట్లాడానన్న అలీ
తమతో గవర్నర్ ఎంతో అభిమానంగా మాట్లాడారని... చాలా సంతోషంగా ఉందని అన్నారు. తాను తమిళంలో మాట్లాడంతో ఆమె ఎంతో ఆనందానికి గురయ్యారని చెప్పారు. సినిమాలలో తనను చూడటం ద్వారా తెలుగు నేర్చుకుంటున్నానని గవర్నర్ తనతో అన్నారని... ఈ మాటలు చాలా సంతోషానికి గురి చేశాయని అన్నారు.
మరోవైపు అలీ తనను కలిసినట్టు తమిళిసై కూడా ట్విట్టర్ ద్వారా తెలిపారు. తన కూతురు వివాహానికి హాజరు కావాలని ఆహ్వానపత్రాన్ని అందించారని చెప్పారు.