ఉక్రెయిన్ అధ్యక్షుడికి తన ఆస్కార్ అవార్డును ఇచ్చిన హాలీవుడ్ స్టార్
- కీవ్ నగరాన్ని సందర్శించి ఆస్కార్ ను బహుమతిగా అందజేసిన షాన్ పెన్
- అమెరికా నటుడికి ఉక్రెయిన్ ఆర్డర్ ఆఫ్ మెరిట్ పురస్కారం ఇచ్చిన జెలెన్ స్కీ
- రష్యా దాడి తర్వాత ఉక్రెయిన్ ప్రజలను ఏకం చేశారని జెలెన్ స్కీకి పెన్ కితాబు
మార్చిలో, ఉక్రెయిన్పై రష్యా దాడి చేసిన తర్వాత హాలీవుడ్ నటుడు తన మొదటి టెలివిజన్ ఇంటర్వ్యూ ఇచ్చారు. ఈ ఇంటర్వ్యూలో సీన్ పెన్ ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్ స్కీతో తన సమావేశాలపై మాట్లాడారు. దాడికి ముందు, తర్వాత ఆయనను కలిశానని చెప్పారు. ధైర్యం, గౌరవం, ప్రేమతో జెలెన్ స్కీ ఉక్రెయిన్ ను ఏకం చేని అందరినీ ఆకట్టుకున్నారని కొనియాడారు. ఇలాంటి విషయం ఆధునిక ప్రపంచంలో ఇదే తొలిసారి అని అభిప్రాయపడ్డాడు.