Wasim Akram: ఏరియల్ తో ఉతికితే నిజంగానే బట్టల మురికిపోతుందా? అంటూ వసీమ్ అక్రమ్ ను ప్రశ్నించిన అభిమాని

Fan questions Akram about washing with Ariel
షార్ట్స్‌లో చూడండి
పాక్ క్రికెట్ లెజెండ్ వసీమ్ అక్రమ్ టీ20 వరల్డ్ కప్ నేపథ్యంలో ఇతర మాజీలతో కలిసి ఓ టీవీ లైవ్ లో పాల్గొన్నాడు. అక్రమ్ తో పాటు వకార్ యూనిస్, మిస్బావుల్ హక్ కూడా ఈ చర్చా కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆ మాజీ క్రికెటర్లకు అభిమానులు పలు ప్రశ్నలను పంపించారు. ఓ అభిమాని అక్రమ్ కు పంపిన ప్రశ్నను వకార్ యూనిస్ చదివి వినిపించాడు. 

వకార్ యూనిస్: ఇది చాలా ముఖ్యమైన ప్రశ్న!
వసీమ్ అక్రమ్: అంత ముఖ్యమైనదా...?
వకార్ యూనిస్: చాలా ముఖ్యమైనది. ఈ ప్రశ్న నీకే. ఇంతకీ ఆ ప్రశ్న ఏంటంటే... ఏరియల్ తో ఉతికితే నిజంగానే బట్టల మురికిపోతుందా?
వసీమ్ అక్రమ్: గత 10 ఏళ్లుగా నేను ఏరియల్ తోనే బట్టలు ఉతుకుతున్నాను. ఇప్పుడు నా వయసు 56 ఏళ్లు. ఏరియల్ తో ఉతికితే బట్టల మురికిపోతుందని కచ్చితంగా చెప్పగలను. ఏరియల్... ఏరియల్.
వకార్ యూనిస్: ఇవును, ఇది చాలా ముఖ్యమైన విషయం. నేను కూడా ఈ విషయం అడగాలనుకున్నాను.
టీవీ చానల్ యాంకర్:  అయితే వసీం అక్రమ్ మన నేషనల్ ధోబీ (బట్టలు ఉతికే వ్యక్తి) అన్నమాట!

కాగా, దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో సందడి చేస్తోంది. 
Go Back to Shorts
Wasim Akram
Live Show
Ariel
Washing
Pakistan
T20 World Cup

More Telugu News