వైఎస్ వివేకానందరెడ్డి కుమార్తె డాక్టర్ సునీతకు క్యాపిటల్ ఫౌండేషన్ పురస్కారం
- అందించిన సీజేఐ జస్టిస్ యూయూ లలిత్
- ప్రపంచ ఆరోగ్య సంస్థ టీబీ నియంత్రణ విభాగంతో కలిసి పనిచేస్తున్న డాక్టర్ సునీత
- అంటువ్యాధుల్లో టీబీతోనే అత్యధిక మరణాలు సంభవిస్తున్నాయన్న డాక్టర్ సునీత
వివిధ రంగాల్లో సేవలందించిన పలువురికి క్యాపిటల్ ఫౌండేషన్.. జస్టిస్ కృష్ణయ్యర్ ఉచిత న్యాయ సేవల విభాగంతో కలిసి ఈ అవార్డులను అందజేస్తుంది. ప్రపంచ ఆరోగ్య సంస్థ టీబీ నియంత్రణ విభాగంతో పాటు పలు సంస్థల్లో సభ్యురాలిగా సునీత సేవలు అందిస్తున్నారు. ఈ సందర్భంగా సునీత మాట్లాడుతూ.. అంటువ్యాధుల్లో టీబీతోనే అత్యధిక మరణాలు సంభవిస్తున్నట్టు పేర్కొన్నారు.