ఆరు రాష్ట్రాల్లో కొనసాగుతున్న ఉప ఎన్నికల పోలింగ్.. శాంతియుతంగా ఓటింగ్
- దేశవ్యాప్తంగా ఏడు నియోజకవర్గాల్లో కొనసాగుతున్న పోలింగ్
- ప్రతి చోట బీజేపీ, ప్రాంతీయ పార్టీల మధ్యే హోరాహోరీ
- బీహార్, మహారాష్ట్రలో సమీకరణాలు మారిన తర్వాత జరుగుతున్న తొలి పోరు ఇదే
ఇక, మిగతా రాష్ట్రాల విషయానికి వస్తే బీహార్‌లో బీజేపీతో నితీశ్ కుమార్ కటీఫ్ చెప్పి ఆర్జేడీతో చేతులు కలిపిన తర్వాత తొలిసారి ఇక్కడి మోకామా, గోపాల్ గంజ్ అసెంబ్లీ స్థానాలకు ఉప ఎన్నికలు జరుగుతున్నాయి. హర్యానాలోని అదంపూర్‌లో ఉప ఎన్నిక జరుగుతోంది. మాజీ ముఖ్యమంత్రి భజన్‌లాల్ కుటుంబానికి ఇది కంచుకోట. భజన్‌లాల్ చిన్నకుమారుడు కుల్దీప్ బిష్ణోయ్ ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయడంతో ఇక్కడ ఉప ఎన్నిక అనివార్యమైంది. ఆయన కాంగ్రెస్‌ను వీడి బీజేపీలో చేరి అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు.
ఇక ఎమ్మెల్యే అరవింద్ గిరి మరణంతో ఉత్తరప్రదేశ్‌లోని గోలా గోరఖ్‌నాథ్ స్థానానికి ఉప ఎన్నిక జరుగుతుండగా, కాంగ్రెస్, బీఎస్పీ పోటీకి దూరమయ్యాయి. దీంతో ఎస్పీ, బీజేపీ మధ్య పోరు జరుగుతోంది. అలాగే, ఒడిశాలోని ధామ్‌నగర్‌కు, ముంబైలోని అంధేరి ఈస్ట్‌లో ఉప ఎన్నికలు జరుగుతున్నాయి. అక్కడ శివసేనలో చీలిక తర్వాత జరుగుతున్న తొలి ఉప ఎన్నిక ఇదే.