Rishab Shetty: 'కాంతార' కథను తెలుగులో తీస్తే 200 కోట్లు అయ్యేదే!: తమ్మారెడ్డి

  • 'కాంతార' గురించి ప్రస్తావించిన తమ్మారెడ్డి 
  • ఆ సినిమాను 16 కోట్లలో తీశారంటూ వెల్లడి
  • తక్కువ మొత్తంలో తీశారు గనుకనే అధిక లాభాలంటూ వ్యాఖ్య  
  • తెలుగులో బడ్జెట్ పెంచేస్తారంటూ వివరణ
Thammareddy Bharadwaja interview

కన్నడ భాషలో రూపొందిన 'కాంతార' అక్కడ రికార్డు స్థాయి వసూళ్లను రాబట్టింది. తెలుగు .. తమిళ .. హిందీ భాషల్లోను భారీ వసూళ్లను సాధించింది. ఈ సినిమాలో హీరోగానే కాదు, రచయితగా .. దర్శకుడిగా కూడా రిషబ్ శెట్టి ప్రశంసలు అందుకుంటూ వెళుతున్నాడు. తాజాగా ఈ సినిమాను గురించి ప్రముఖ దర్శక నిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ ప్రస్తావించారు.

"తెలుగు హీరోలు తమ సినిమాల హిందీ డబ్బింగ్ రైట్స్ ఎక్కువ పలుకుతున్నాయనీ .. ఓటీటీల్లో తమ సినిమాలకి క్రేజ్ ఉందనీ .. ఫ్యాన్ ఇండియా మార్కెట్ ఉందంటూ రేట్లు .. రెమ్యునరేషన్లు పెంచుకుంటూ పోతున్నారు. ఇతర భాషల్లో చాలా తక్కువ ఖర్చుతోనే టెక్నీకల్ గా కూడా మంచి అవుట్ పుట్ ఇస్తున్నారు. మనవాళ్లు ఎక్కువగా ఖర్చు పెట్టినా ఆ స్థాయి అవుట్ పుట్ ను అందించలేకపోతున్నారు " అని అన్నారు . 

'కాంతార' విషయానికొస్తే జాతరలు .. పూనకాలు మన దగ్గర కూడా ఉన్నాయి. కాకపోతే ఆ సినిమాలో చూపించిన వేషధారణ మాత్రం ఇక్కడ ఉండదు. ఆ సినిమాను కేవలం 16 కోట్లలో తీశారు .. 200 కోట్లకి పైగా వసూలు చేసింది. అందువలన లాభాలు బాగా వచ్చాయి. ఆ స్థాయి డైరెక్టర్ .. హిట్లు ఇచ్చిన హీరోతో ఆ సినిమాను తెలుగులో చేయాలంటే 200 కోట్లు అయ్యుండేది. అప్పుడు ఆ సినిమా 200 కోట్లు రాబట్టినా ప్రయోజనం ఉండేది కాదు. అలా కాకుండా వాళ్లు ఎక్కడ ఉండాలో అక్కడ ఉండి .. ఎలా చేయాలో అలా చేసుకున్నారు గనుకనే ఈ రోజున ఆ సినిమా అంత పెద్ద హిట్ అయింది" అంటూ చెప్పుకొచ్చారు. 

More Telugu News