fruit: చెడు కొలెస్ట్రాల్ ను కరిగించే పళ్లు ఇవిగో!

  • తినే ఆహారం, జీవనశైలితో కొలెస్ట్రాల్ ముప్పు
  • కొలెస్ట్రాల్ పెరిగిపోతే హార్ట్ ఎటాక్ రిస్క్
  • కొన్ని రకాల పండ్లతో ఈ రిస్క్ తగ్గించుకోవచ్చు
Which fruit can reduce my bloodbad v level overnight

కొలెస్ట్రాల్ లో అధిక భాగం లివర్ లోనే ఉత్పత్తి అవుతుంది. మనం తీసుకునే ఆహారం ఫలితమే కొలెస్ట్రాల్. ముఖ్యంగా కొలెస్ట్రాల్ లో ఎల్ డీఎల్ వల్ల మహా ముప్పు. ఇది పరిమితి దాటి ఉంటే రక్త నాళాల గోడలపై గార పడుతుంది. 

అసలు చెడు కొలెస్ట్రాల్ ఎందుకు చేరుతుంది? అంటే అధిక కార్బోహైడ్రేట్స్ ఉండే ఆహారాన్ని తీసుకోవడం వల్లే. శాచురేటెడ్ ఫ్యాటీ యాసిడ్స్ ఉన్నవి, స్వీట్లు, కొవ్వు అధికంగా ఉండే పదార్థాలు తీసుకుంటే ఎల్ డీఎల్ పెరగొచ్చు. ఆహారం ఒక్కటే కాదు. శారీరక వ్యాయామం లేకపోవడం వల్ల తిన్న ఆహారం సంపూర్ణంగా వినియోగం కాదు. అప్పుడు కూడా చెడు కొవ్వులు పెరుగుతాయి. 

అందుకే ఫైబర్ ఉండే ఆహారానికి చోటు ఇవ్వాలి, పోషకాలు ఉండేలా చూసుకోవాలి. శారీరక వ్యాయామం చేయడం వల్ల చెడు కొలెస్ట్రాల్ ప్రభావం తగ్గి, మంచి కొలెస్ట్రాల్ అయిన హెచ్ డీఎల్ పెరుగుతుంది. హెచ్ డీఎల్ ఎంత ఎక్కువ ఉంటే అంత మంచిది. గుండెను కాపాడుతుంది. దీనికితోడు కొన్ని రకాల పండ్లను రోజువారీగా తినడం వల్ల చెడు కొలెస్ట్రాల్ ను తగ్గించుకోవచ్చు. ఎందుకంటే పండ్లలో సొల్యూబుల్ ఫైబర్ ఎక్కువ. గుండె జబ్బులు రాకుండా నివారిస్తుంది. 

యాపిల్స్
యాపిల్ లో పెక్టిన్ ఎక్కువగా ఉంటుంది. కొలెస్ట్రాల్ ను తగ్గించేందుకు ఇది ఎంతో సాయపడుతుంది. ఇదొక రకమైన ఫైబర్. దీనితోపాటు, యాపిల్ లో ఉండే పాలీ ఫెనాల్స్ కూడా చెడు కొలెస్ట్రాల్ ను తగ్గిస్తాయి.

పియర్స్
ఒకప్పుడు లేవు కానీ, పియర్స్ పండ్లు ఇప్పుడు మన దగ్గర కూడా అందుబాటులోకి వచ్చాయి. వీటిల్లో సొల్యూబుల్ ఫైబర్ అధికంగా ఉంటుంది. ఇది అధిక కొలెస్ట్రాల్ ను తగ్గించి, గుండెను ఆరోగ్యంగా ఉంచుతుంది.

బెర్రీస్
బెర్రీల్లో ఆరోగ్య గుణాలు పుష్కలం. వీటి ఖరీదు కూడా ఎక్కువే. 100 గ్రాములు రూ.300 వరకు ఉంటుంది. బెర్రీల్లో ఫైబర్ ఎక్కువ. కొలెస్ట్రాల్ ఆక్సీకరణాన్ని నివారిస్తుంది. కొలెస్ట్రాల్ ఆక్సీకరణం వల్ల గుండె జబ్బులకు దారితీయవచ్చు. 

కమలా/నారింజ
వీటిల్లో ఫైబర్, విటమిన్ సీ ఎక్కువ. ఇవి కొలెస్ట్రాల్ ను తగ్గించి గుండె ఆరోగ్యాన్ని పెంచుతాయి.

అవకాడోలు
ఇది కూడా విదేశాల నుంచి వచ్చిన పండే. ఈ పండులోని ఒలియిక్ యాసిడ్ చెడు కొలెస్ట్రాల్ ను తగ్గిస్తుంది. తినడానికి రుచిగానూ ఉంటాయి.

More Telugu News