నాన్సీ పెలోసీ భర్తపై దాడి కేసు.. వెలుగులోకి మరో కీలక విషయం
- పాల్ పెలోసీపై దాడి సందర్భంగా నాన్సీ ఎక్కడంటూ నిందితుడి కేకలు
- దాడి రాజకీయ ప్రేరేపితమన్న కోణంలో విచారణ
- నిందితుడిపై మరో రెండు అభియోగాల నమోదు
నిందితుడిపై డిపార్ట్‌మెంట్ ఆఫ్ జస్టిస్ అదనంగా మరో రెండు అభియోగాలను మోపింది. అందులో ఒకటి అధికారుల విధులను ఆటంకపరిచేందుకు కుటుంబ సభ్యులపై దాడి చేయడం కాగా, రెండోది నాన్సీని కిడ్నాప్ చేయడం. నిందితుడి నుంచి ఒక టేప్ రోల్, తాడు, సుత్తిని స్వాధీనం చేసుకున్నారు. నాన్సీని అతడు బందీగా పట్టుకోవాలన్న ఉద్దేశంతో ఆమె ఇంట్లోకి చొరబడినట్టు పోలీసులు నిర్ధారణకు వచ్చారు. ఈ దాడి రాజకీయ ప్రేరేపితమని భావిస్తున్న పోలీసులు ఆ దిశగా దర్యాప్తు చేస్తున్నారు.